1971లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అజయ్ దేవగన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘భుజ్’. ఈ సినిమాకు లాక్డౌన్ కంటే ముందు ఓ చిక్కొచ్చి పడింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అప్పుడు రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలి. అందులో పాకిస్థాన్ గూఢచారులతో హీరో అజయ్ దేవగన్ తలపడాలి. మరో సన్నివేశంలో సంజయ్‌దత్ లాంటి వారిని ఎదుర్కోవాలి. వీటికి దర్శకత్వం వహించడానికి యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆ సమయంలో అందుబాటులో లేరు. ఏం ఆలోచించకుండా వెంటనే అజయ్ దేవగన్ యాక్షన్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఈ రెండు సన్నివేశాలను సులువుగా లాగించేశారు. ఈ విషయాల్ని తాజాగా ఆ సినిమా ప్రతినిధులు వెల్లడించారు.
పీటర్ బదులు అజయ్
Related tags :