ScienceAndTech

యాపిల్ సొంత చిప్ తయారీ

Apple To Make Its Own ARM Based Chips Kicking Intel

టెక్‌ దిగ్గజాలు ఇంటెల్‌, యాపిల్‌ సంయుక్తంగా ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్‌ తయారీలో యాపిల్‌ సంస్థ ఇంటెల్‌ మైక్రోప్రాసెసర్‌లను ఉపయోగిస్తుంది. అదే విధంగా యాపిల్‌ సంస్థ అత్యాధునిక చిప్‌లను రూపొందిస్తుంది. సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్‌ దిగ్గజాం ఇన్‌టెల్‌తో విడిపోవాలని యాపిల్‌ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్‌ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫీచర్లతో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్(ఐఫోన్‌)‌లను రూపొందించి కోట్లాది వినియోగదారులను యాపిల్‌ ఆకట్టుకుంది. ‌కానీ యాపిల్‌ సంస్థ సొంతంగా నిలదొక్కుకునే వ్యూహాలు రచిస్తుంది.