జూన్ 21వ తేదీ అంటే ఈ రోజు (ఆదివారం) ఏడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ తేదీకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఒక్క రోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదికకానుంది. ఒకే రోజు ఏడు ‘డే’లు రానున్నాయి. వీటిల్లో ప్రపంచం నాశనమవుతుందన్న ‘డూమ్స్ డే’ కూడా ఉండటం మరో విశేషం. దీన్ని పక్కన పెడితే.. మిగతావి ఏ దినోత్సవాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రపంచ యోగా దినోత్సవం: 2015లో భారత ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన తరువాత ప్రతీ ఏడాది జూన్ 21న ‘ఇంటర్నేషనల్ యోగా డే’గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఇక ఇదే రోజు యోగా డేను ఎందుకు జరుపుకుంటారంటే.. ఏడాదిలో జూన్ 21వ తేదీన పగటి సమయం అత్యధికంగా ఉంటుంది.
ఫాదర్స్ డే: నిజానికి ఫాదర్స్ డే ప్రతీ ఏడా జూన్ 3న నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం మూడో వారంలో ఆదివారం జూన్ 21న వచ్చింది. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన సుఖాన్ని కూడా పక్కన పెట్టి పాడుపడే తండ్రిని గౌరవించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపకుంటారు.
షేక్ హ్యాండ్ డే: ప్రతీ ఏటా జూన్ 21న ‘షేక్ హ్యాండ్ డే’ జరుపుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది షేక్ హ్యాండ్ డే జరిగేలా లేదు.
వరల్డ్ మ్యూజిక్ డే: జూన్ 21న వరల్డ్ మ్యూజిక్ డేను కడా జరుపుకోనున్నారు. 1982లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇది ప్రారంభమయ్యింది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
వరల్డ్ హ్యుమనిస్ట్ డే: ప్రతీ యేటా జూన్ 21ని వరల్డ్ హ్యుమనిస్ట్ డే అంటే ప్రపంచ మానవత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల్లో మానవత్వాన్ని పెంచేలా 1980 నుంచి మానవత్వ దినోత్సవం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం పెంపొందించటానికి కృషి చేసేందుకు స్ఫూర్తినిచ్చే రోజు.
జల దినోత్సవం: జల దినోత్సవం దీన్నే వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అని కూడా అంటారు. సమస్త ప్రాణ కోటికి జీవనాధారం నీరు. నీరు లేకపోతే ఏ పనీ జరగదు. జల వనరుల అభివృద్దికి ప్రజలు కట్టుబడి ఉండేలా చేసేందుకు హైడ్రోగ్రఫీ డేను జరుపుతారు. 2005 జూన్ 21 నుంచి ఇది ప్రారంభయ్యింది.
టీ షర్ట్ డే: వీటన్నింతో పాటు టీ షర్ట్ దినోత్సవం కూడా జూన్ 21న జరుగుతుంది. 2008లో దీన్ని ఓ జర్మనీ దుస్తుల సంస్థ ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతారు. కొన్ని దేశాల్లో అయితే టీ షర్ట్ డే ఓ ఉత్సవంలా కూడా జరుగుతుంది.