Movies

కలలు కంటాను. వాస్తవంలో బతుకుతాను.

Reetu Varma Speaks Of COVID19 Lessons & Experiences

అచ్చ తెలుగు అందం… రీతూవర్మ. ఆధునిక ఆలోచనలున్న అమ్మాయికి ప్రతిరూపంలా కనిపిస్తూ పాత్రల్ని రక్తి కట్టిస్తోంది. అందమే కాదు, సహజమైన నటనా ఆమె సొంతం. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో అమ్మాయంటే ఇలా ఉండాలనేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’తో మరో విజయాన్ని అందుకుంది. నాని, శర్వానంద్‌, నాగశౌర్యలతో కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఇంట్లో గడుపుతున్న రీతూ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ…సృజనాత్మకమైన ఆలోచనలున్న వ్యక్తిని నేను. కళారూపాల్ని ఎక్కువగా ఇష్టపడతా. ఊహలంటే ఇష్టం. పగటి కలలు ఎక్కువగా కంటుంటా. ఏదైనా చేయాలనిపించినా, లేక ఏదైనా కావాలి అనిపించినా దాని గురించి పదే పదే ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటా. సగటు అమ్మాయిల్లాగే ఫన్‌ని ఇష్టపడతా. ప్రతి దానికీ టెన్షన్‌ పడే రకం కాదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను, ఎన్ని కలలు కన్నా వాస్తవంలో బతుకుతుంటా.