పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.46,985 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు. స్వల్ప, మధ్యకాలానికి రూ.48,107; రూ.48,889 లక్ష్యంతో లాంగ్ పొజిషన్లు కొనసాగించవచ్చు. కొత్తగా మరిన్ని పొజిషన్లు జతచేసుకోవచ్చు. కరోనా అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడి సానుకూలంగానే కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు ప్రభావం చూపొచ్చు. ఆర్థిక గణాంకాలు కూడా అంతంత మాత్రంగా ఉండటం, మార్కెట్లు దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తోండటం పసిడికి కలిసిరావొచ్చు. వెండి జులై కాంట్రాక్టు ఈవారం ఒడుదొడుకులకు లోనుకావచ్చు. ఒకవేళ రూ.47,878 దిగువకు చేరకపోతే లాభాల్లో కదలాడొచ్చు. ఈ స్థాయి కిందకు చేరితే మాత్రం దిద్దుబాటుకు గురికావొచ్చు. ఈ వారం కూడా వెండికి అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉండటంతో రూ.47,878 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయిని అధిగమించి, కనీసం ఒక రోజైనా నిలదొక్కుకుంటే కాంట్రాక్టు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
ఒత్తిడిలో వెండి అమ్మకాలు
Related tags :