Devotional

తిరుమలలో శాంతి జపయజ్ఞం

TTD Conducts Japayagnam In Tirumala During Eclipse To Fight COVID19

సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని కరోనా వ్యాధి నుంచి ప్రపంచ మానవాళిని రక్షించాలని తితిదే ఆదివారం గ్రహణ శాంతి జపయజ్ఞం చేపట్టింది. సూర్యగ్రహణ సమయం ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 గంటల వరకు ఈ యజ్ఞం కొనసాగనుంది. ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తితిదే ఈ జపయజ్ఞం నిర్వహిస్తోంది. ఇందులో శ్రీవారి అర్చకులు, జీయంగార్లు, శ్రీవారి సేవకులు ప్రముఖ వేద పారాయణదారులు పాల్గొని జపహోమ అభిషేకాలను నిర్వహించారు. తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, పెద్ద జీయంగార్‌, చిన్న జీయంగార్‌ తదితరులు పాల్గొన్నారు.