NRI-NRT

డీసీ నుండి ఢిల్లీకి బయల్దేరిన ప్రత్యేక విమానం

Vande Bharat Flight Mission - DC To Delhi With 215 Passengers

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 215 మంది భారతీయులతో కూడిన ఓ ప్రత్యేక విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఈ విషయాన్ని యూఎస్‌ఏలోని ఇండియన్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది. వందే భారత్‌ మిషన్‌ ఫేస్‌ 3లో భాగంగా ఈ విమానాన్ని నడుపుతున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకువచ్చేందుకు మే 7న కేంద్ర సర్కారు వందే భారత్‌ మిషన్‌ను ప్రారంభించింది. రెండు ఫేస్‌లు అయిపోగా, ఈ నెల 11న మూడో దశ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల నుంచి 2,50,087 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫేస్‌ 3లో 550 ప్రత్యేక విమానాల ద్వారా విదేశాలనుంచి భారతీయులను తీసుకురానున్నట్లు పేర్కొంది.