Business

ఆల్‌టైమ్ రికార్డు ధరకు బంగారం

Gold Price Reaches All Time High

భారీగా పెరిగిన బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ …..

పుత్త‌డి సామాన్యుల‌కు అంద‌నంటోంది.. పైపైకి ఎగ‌బాకుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది..

ఒకేరోజు భారీగా పెర‌గ‌డంతో.. ఆల్‌టైమ్ హైకి చేరింది గోల్డ్ రేట్‌..

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో రూ.520 పెర‌గ‌డంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,090కు చేరుకోగా..

ఇదే స‌మ‌యంలో రూ.570 పెర‌గ‌డంతో..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,270కు చేరి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరి కొత్త రికార్డులు సృష్టించింది.

పుత్త‌డి బాట‌లోనే వెండి కూడా ప‌రుగులు పెట్టింది.. కేజీ వెండి ధర ఒకేరోజు రూ.620 పెర‌గ‌డంతో.. రూ.48,670గా ప‌లుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెడుతోంది..

బంగారం ధర ఔన్స్‌కు 0.60 శాతం పెర‌గ‌గా.. దీంతో ఔన్స్‌కు 1763 డాలర్ల పైకి చేరింది.