కరోనా మహమ్మారి కారణంగా సంపన్న ఆలయ ట్రస్టుల్లో ఒకటైన షిరిడీ సాయిబాబా ట్రస్టు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఏటా రూ.400 కోట్ల ఆదాయం పొందే ఈ ప్రసిద్ధ ఆలయం.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది.
నిర్వహణ ఖర్చులు కూడా సమకూర్చు కోలేకపోతోంది.
ప్రతినెలా 5వ తేది వరకు వచ్చే జీతాలు ఈ సారి 20 దాటినా రాలేదని షిరిడీ ఆలయ సిబ్బంది తెలిపారు.
ట్రస్టును ఈ విషయమై సమాచారం అడిగినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు నీటిని సరఫరా చేసే 32 మంది సిబ్బందికి గతేడాది నవంబరు నుంచి జీతాలు చెల్లించలేదు.
తక్షణమే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.