DailyDose

మాచర్లలో మూడు కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin || Andhra COVID19 Statistics Today

* తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కరోనా ఆలయాల్లోనూ కల్లోలం రేపుతోంది.తాజాగా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.

* గుంటూరు జిల్లా తెనాలిలో 27 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్యతెనాలి షరాఫ్ బజారు లో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదుతెనాలి మండలం అంగలకుదురు లో 1 కరోనా కేసు నమోదుఈ ఏరియాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.

* మాచర్ల పట్టణంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది..సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు..కరోనా పాజిటివ్ ఏరియాలో బ్లీచింగ్, క్లోరినేషన్ పనులు చేపట్టారు.

* ఉత్త‌ర్ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌ ప్ర‌భుత్వ బాలిక‌ల ఆశ్ర‌య గృహంలో 57 మంది బాలిక‌ల‌కు క‌రోనా సోకింది. వీరిలో ఐదుగురు గ‌ర్భ‌వ‌తులు. ఒకరు హెచ్ఐవీ బాధితురాలు. ఈ సమాచారం నిజమేనని అధికారులు ధ్రువీక‌రించ‌డంతో స్థానికంగా క‌ల‌వ‌రం మొద‌లైంది.

* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో దీని విస్తరణ చాలా ఎక్కువగా ఉంది. అయితే, ప్రపంచ దేశాల్లో సగటున లక్ష జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే, భారత్‌లో అతి తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఉదయం 10 వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372