Movies

పదిహేను కోసం పాట్లు

పదిహేను కోసం పాట్లు

ప్రోటీన్లు, క్యాలరీలు అంటూ లెక్కలు వేసుకుని మరీ ఫుడ్‌ను ఫుల్‌గా లాగించేస్తున్నారు కథానాయిక కృతీ సనన్‌. హీరోయిన్స్‌ ఎవరైనా స్లిమ్‌గా ఉండాలనుకుంటారు కదా! అంటే నిజమే.. కానీ వారే పాత్ర కోసం ఎంతైనా కష్టపడతారు కూడా. తన తాజా చిత్రం ‘మిమి’లోని పాత్ర కోసం తక్కువ సమయంలో పదిహేను కేజీల బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్నారు హీరోయిన్‌ కృతీసనన్‌. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ–‘‘బరువు పెరగడం అనేది నాకు కొత్త చాలెంజ్‌.తక్కువ సమయంలో బరువు పెరగడం అనేది అంత సులువైన విషయం కాదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. వీటన్నింటిని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాను. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ తర్వాత నాకు నేను ఎలా కొత్తగా కనిపిస్తానో చూడటానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఇందుకోసం నేను చేయగలిగినదంతా చేస్తాను’’ అని కృతీ సనన్‌ పేర్కొన్నారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పంకజ్‌ త్రిపాఠి ఓ కీలక పాత్ర చేస్తున్నారు.