Sports

జకోవిచ్‌కు కరోనా

జకోవిచ్‌కు కరోనా

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌కు కరోనా సోకింది. ఈ మేరకు జకోవిచ్‌ స్వయంగా ప్రకటించాడు. ‘‘బెల్‌గ్రేడ్‌కు వచ్చిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకున్నాం. నాకు, నా భార్య జెలెనా రిస్టిక్‌కు పాజిటివ్‌ వచ్చింది. అయితే నా పిల్లలకు నెగిటివ్‌ వచ్చింది. అందుకే 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటాం’’ అని జకోవిచ్‌ ప్రకటన విడుదల చేశాడు.ఇటీవల సెర్బియా, క్రొయేషియాలో జరిగిన టెన్నిస్‌ ఎగ్జిబిషన్‌ సిరీస్‌లో జకోవిచ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే.