పంతొమ్మిదేళ్లకే తెరపైకొచ్చింది రకుల్‌ప్రీత్ సింగ్. ఈ పదేళ్లలో చాలా ఎదిగింది. అగ్ర కథానాయికగా మారింది. అయితే తన తొలిరోజుల్ని అస్సలు మర్చిపోలేదు. వాటిని ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది. ‘‘కన్నడలో నా తొలి చిత్రం ‘గిల్లీ’. ఆ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడింది లేదు. నటన గురించి పెద్దగా అవగాహన లేకుండానే కెమెరా ముందుకు వచ్చేశాను. ఎలాంటి హోమ్ వర్కు చేయలేదు. నిజానికి ఆ సినిమా కేవలం నా పాకెట్ మనీ కోసమే నటించాను. ఆ రోజుల్లో కారు కొనుక్కోవాలని చాలా సరదాగా ఉండేది. పైగా నా స్నేహితులెవరికీ కారు లేదు. మా గ్యాంగ్‌లో మొదటి కారు నాదే కావాలి అనుకునేదాన్ని. పైగా ఆ కారు నా సొంత డబ్బులతో కొనుక్కోవాలని ఉండేది. అందుకే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. కానీ ఆ తరవాత అదే నా వృత్తిగా మారిపోయింది. స్టార్‌డమ్, క్రేజ్ అనే పెద్ద పెద్ద పదాల్ని నేను పట్టించుకోలేదు. ఓ ఉద్యోగాన్ని ఎంత నిబద్ధతతో చేస్తానో, అంతే క్రమశిక్షణతో నటిస్తున్నా. బహుశా నా ఎదుగుదలకు అదే కారణం కావొచ్చు’’ అంది.
కారు కోసం కెమెరా ముందుకు!
Related tags :