సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లోని సినీ వారసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంధుప్రీతి, గుత్తాధిపత్య ధోరణి వల్లే ప్రతిభావంతులైన నటులు అవకాశాల్ని కోల్పోతున్నారని నెటిజన్లు అగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. అనిల్‌కపూర్ తనయ సోనమ్‌కపూర్‌ను సోషల్‌మీడియాలో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. వారసత్వం వల్లే కథానాయికగా మారిందని, ప్రతిభాసంపత్తుల వల్ల కాదంటూ సోనమ్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శలపై సోనమ్ స్పందిస్తూ ‘అనిల్ కపూర్ కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నా. నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. నాకు లభించిన పేరుప్రఖ్యాతులు, గుర్తింపు వెనుక నాన్న ఎన్నో ఏళ్ల శ్రమ, కష్టం దాగివున్నాయి. నేను ఎక్కడ, ఎవరి కడుపులో పుట్టాలి అనే అంశాన్ని కర్మ నిర్ణయ్తింది. అనిల్‌కపూర్ వారసురాలిగా గర్విస్తా’ అని తెలిపింది. ఒకరిపై ఆదరణ, దయను చూపించమని చెబుతున్న అభిమానులే మరొకరిని దూషిస్తున్నారంటూ తనపై సోషల్‌మీడియాలో వచ్చిన కామెంట్స్‌ను స్క్రీన్‌షాట్స్ తీసి షేర్‌చేసింది. ఈ ట్రోల్స్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ బాక్స్‌ను డిసెబుల్ చేసింది సోనమ్‌కపూర్.
నా సత్తా అంతా వారసత్వమే!
Related tags :