* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా మొత్తం తొమ్మిది బ్యాంకులకు నెగెటివ్ రేటింగ్. ఆయా బ్యాంకులకు ఇది షాకింగ్ న్యూసే. దేశ సార్వభౌమ రేటింగ్ లో చోటుచేసుకున్న మార్పు దృష్ట్యా ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది భారతీయ బ్యాంకులకు సంబంధించి… ఔట్లుక్… స్టేబుల్ నుంచి నెగిటివ్ కు సవరించినట్లు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది.ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ మహమ్మారి చూపిన ప్రభావంతో భారత్ సార్వభౌమ రేటింగ్‌లో ఇప్పటికే వచ్చిన మార్పును దృష్టిలో పెట్టుకుని ఈ చర్య తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ తదితర బ్యాంకుల ఔట్ లుక్… నెగిటివ్ కు సవరించింది.కాగా ఈ పరిణామం… పెట్టుబడులపై ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆర్థిక రంగం క్షీణించింది. ఈ ప్రభావం స్పష్టంగా రేటింగ్ లో కనిపించినట్లు చెబుతున్నారు.
* కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది.
* పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. రోజురోజుకూ భారమవుతూ చుక్కలు చూపుతున్నాయి. ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం వరుసగా 17వ రోజూ పెంచాయి. పెట్రల్ లీటర్‌కు 20 పైసలు, డీజిల్ లీటర్‌కు 63 పైసల మేర పెరిగాయి.
తాజా ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ 79.76 రూపాయలు కాగా, డీజిల్ లీటర్ 79.40కి ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ఏకంగా 82.59కి చేరింది. కరోనా మహమ్మారితో ప్రజల ఆదాయాలు పడిపోయిన క్రమంలో ప్రభుత్వం పెట్రో భారాలు మోపుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.
* భారత ప్రభుత్వం ఛార్టర్ విమానాల రాకపోకల విషయంలో వివక్షతో వ్యవహరిస్తోందని అమెరికా రవాణా శాఖ ఆరోపించింది. భారత విమానయాన సంస్థలు ఛార్టర్ విమానాలు నడిపే ముందు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత్ సంస్థ నడిపే ప్రతి విమానాన్ని పరిశీలించే అవకాశం అమెరికా అధికారులకు లభిస్తుంది.
* 2020కి భారత్ ఆర్థిక వృద్ధి రేటు 3.1 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఏప్రిల్‌లో సంవత్సర ఆర్థిక వృద్ధి 0.2 శాతం నమోదు చేసిందని మూడీస్ తెలిపింది. అయితే కరోనా అంతరాలను అధిగమించిన తర్వాత వృద్ధి రేటు భారీగా పెరిగిందని మూడీస్ తెలిపింది. 2021 నాటికి భారత్ వృద్ధి రేటు 6.9 శాతం ఉంటుందని అంచనా వేసింది.