DailyDose

నెదర్ల్యాండ్స్ నుండి భీమవరానికి డ్రగ్స్ రవాణా-నేరవార్తలు

Telugu Crime News - Drugs Transport From Netherlands To Bheemavaram

* కావలి పట్టణ పరిధిలోని 10వ వార్డు హరిజనవాడలో మేల శ్రీధర్(39) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న కావలి వన్ టౌన్ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీధర్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు అని తెలియజేశారు. లాక్ డౌన్ కారణంగా కావలికి వచ్చిన అతను కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రాత్రి భోజనానంతరం పై అంతస్తులో నిద్రించిన శ్రీధర్ నేటి ఉదయం ఎంతకి క్రిందికి రాకపోవటంతో అనుమానంతో పై గదిలో పరిశీలించగా ఉరి వేసుకుని వేలాడుతున్న ట్లు గుర్తించారు. తమకు సమాచారం ఇవ్వగా అనుమానాస్పద మృతిగ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని తెలియజేశారు.

* పురుగుల మందు ను చికెన్ మసాలా అనుకుని కూరలో కలపడంతో కూరను తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందగా…వృద్ధురాలు స్థితిలో ఉంది ఈ ఘటన ఘటన గుడిపాల మండలం ఏ యల్ పురం గ్రామం లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

* తిరుపతి నగరంలో భారీ చోరీ.322 గ్రాముల బంగారం, 1కేజీ వెండి ,70 వేల నగదు దోచుకున్న ఘనుడు.శుక్రవారం రాత్రి చోరీ ఆలస్యంగా వెలుగులోకి .మహిళలకు మత్తు మందు ఇచ్చి దోచుకున్న కేటుగాడు.

* నెదర్లాండ్స్ నుండి భీమవరం కు డ్రగ్స్ రవాణా కేసులో ప్రారంభమైన పోలీసు ల దర్యాప్తు.12 లక్షల విలువైన డ్రగ్స్ ను భీమవరం కు చెందిన భానుచందర్ ఆర్డర్ ఇవ్వటంతో అతడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు.ఇదే కేసులో లోకల్ గా డ్రగ్స్ వినియోగదారులు, అమ్మకం దారులు ఎవరో కనిపెట్టేందుకు రంగంలో కి దిగిన పోలీసులు.నిందితుడు భానుచందర్ కు సన్నిహితంగా ఉండే వారిని అదుపులోకి తీసుకుని విచారణ.

* గుడ్లవల్లేరు పంచాయతీ కార్యాలయం పై ఎసిబి అధికారులు దాడులు. పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కార్యదర్శి కోటయ్య.

* వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖపై స్పందించిన స్పీకర్‌ ఓం బిర్లా.తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని స్పీకర్‌కు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు.లేఖను హోంశాఖకు పంపిన స్పీకర్‌. తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖను కోరిన స్పీకర్‌.