భారత ప్రభుత్వం ఛార్టర్ విమానాల రాకపోకల విషయంలో వివక్షతో వ్యవహరిస్తోందని అమెరికా రవాణా శాఖ ఆరోపించింది. భారత విమానయాన సంస్థలు ఛార్టర్ విమానాలు నడిపే ముందు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత్ సంస్థ నడిపే ప్రతి విమానాన్ని పరిశీలించే అవకాశం అమెరికా అధికారులకు లభిస్తుంది. భారత్-అమెరికా విమాన రవాణా ఒప్పందం ప్రకారం సమాన అవకాశాలు కల్పించామని అమెరికా రవాణా శాఖ పేర్కొంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. అదే సమయంలో అమెరికా ఛార్టర్ విమానాలకు అనుమతులు ఇవ్వడంలో విఫలమైందని ఆ శాఖ ఆరోపించింది. అకారణంగా అనుమతులను నిలిపివేసిందని పేర్కొంది. ఎయిర్ ఇండియా మాత్రం స్వదేశానికి విమాన సర్వీసుల పేరుతో ఛార్టర్ సేవలు అందిస్తోందని విమర్శించింది. మే 28నే దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా అభ్యంతరాలను వెల్లడించింది.
భారత అంతర్జాతీయ విమానాలపై అమెరికా అభ్యంతరాలు
Related tags :