DailyDose

ఏపీ ఎమ్మెల్యేకు కరోనా-TNI బులెటిన్

USA Returned Andhra MLA Tested Positive For Corona

* హిందూపురం సబ్ జైలు లో మళ్ళీ కరోనా కలకలం.మంగళవారం వెల్లడైన కోవిడ్ టెస్టింగ్ లో సుబ్ జైల్ లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 6 మందికి పాజిటివ్.వెంటనే కోవిడ్ హాస్పిటల్ కు తరలించిన అధికారులు.ఇప్పటికే 2 ఖైదీలకు కరోనా రాగా మొత్తం 8 మంది ముద్దాయిలుకు వైరస్ సోకింది.వీరంతా రహమత్ పురం లో జరిగిన హత్య కేసులో నిందితులే.కాగా హ్ద్ప్ లో కొత్తగా 12 మందికి వైరస్ సోకినట్లు ఈరోజు రిజల్ట్ వచ్చిందని అధికారుల వెల్లడి.

* ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొంది. ‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ…..‘కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్‌ పేర్కొన్నారు. ‘కొరోనిల్’‌ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనావైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.

* ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ వ్యాక్సిన్‌ కోసం అన్ని దేశాలు పరిశోధనలు, ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రతను తగ్గించి బాధితులకు ఉపశమనం కలిగించేలా ఫ్యావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌, సిప్రిమి తదితర ఔషధాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫ్యావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాలకు డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి మంజూరు చేసింది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధికి కరోనా వైరస్‌ సోకింది. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఈ నెల 10న ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చారు. కరోనా లక్షణాలను గుర్తించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. ట్రూనాట్‌, ఆర్డీ-ఆర్పీ, ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

* దేశంలో రికవరీ రేటు కూడా క్రమంగా మెరుగుపడుతోంది. గడిచిన 24గంటల్లో 10,994 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 2,48,189కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో రికవరీ రేటు 56.38శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

* గత 24గంటల్లో దేశంలో మరో 14,933 కేసులు నమోదవ్వడంతో మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 4,40,215కి పెరిగింది. వీరిలో 14011మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.