Fashion

మీ బ్యాగుకు రక్షణకవచం

మీ బ్యాగుకు రక్షణకవచం

రుతుపవనాలు వస్తున్నాయి. వాటితో పాటూ రేపోమాపో చల్లటిగాలు, చినుకులు కూడా పలకరిస్తాయి. తడవకుండా ఉండేందుకు మనమైతే చేతిలో గొడుగు, ఒంటికి రక్షణగా ఓ రెయిన్‌కోట్‌ని సిద్ధం చేసుకుంటాం. మరి ఫోను, గుర్తింపు కార్డులు, ముఖ్యమైన వస్తువులు దాచుకునే హ్యాండు బ్యాగు సంగతేంటి? దానికి కూడా రక్షణ ఉండాలిగా! అందుకోసమే ఈ బ్యాగు రెయిన్‌కోట్లు. వివిధ రంగుల్లో బ్యాగు రక్షణ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.