భారత్‌లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ ఎవరు..? గణాంకాలు, రికార్డులు సచిన్ అని చెబుతున్నప్పటికీ.. అభిమానులు మాత్రం ద వాల్ రాహుల్ ద్రవిడ్‌కే ఓటు వేశారు. గత 50 ఏళ్ల భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరన్న దానిపై విజ్డెన్ ఇండియా ఆన్‌లైన్ పోల్‌్ నిర్వహించింది. పదహారు మంది మధ్య పోటీలో సచిన్, ద్రవిడ్ తుది పోరుకు అర్హత పొందారు. సామాజిక మాధ్యమం వేదికగా 11400 మంది అభిమానులు ఓటింగ్‌లో పాల్గొనగా.. ద్రవిడ్‌కు 52 శాతం మంది మద్దతు పలికారు. 164 టెస్టుల్లో ద్రవిడ్ 52.31 సగటుతో 13288 పరుగులు చేయగా.. సచిన్ 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15921 పరుగులు సాధించాడు. సచిన్ 51 సెంచరీలు.. ద్రవిడ్ 36 సెంచరీలు సాధించారు. అయితే మూడో స్థానంలో అసాధారణ పోరాటాలతో జట్టును ఎన్నోసార్లు ఆదుకున్న ద్రవిడ్‌నే అత్యుత్తమ టెస్టు ఆటగాడిగా అభిమానులు ఎన్నుకున్నారు. అంతకుముందు గావస్కర్‌ను ద్రవిడ్, కోహ్లీని సచిన్ ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించారు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కోహ్లీపై గావస్కర్ గెలుపొందాడు.
సచిన్ కాదు…ద్రవిడే బెస్ట్
Related tags :