DailyDose

పెట్రోల్ ధరను దాటేసిన డీజిల్ ధర-వాణిజ్యం

Telugu Business News Roundup Today || Diesel Price Overcomes Petrol Price In India

* ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు. ఆర్డినెన్స్‌ మంత్రివర్గం ఆమోదం. సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఇక ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

* కరోనా దెబ్బకు రవాణా రంగం దారుణంగా దెబ్బతిన్నది. దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరగడం లేదు. కఠిన నియమ నిబంధనల మధ్య దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా కేంద్రం రైల్వే సర్వీసులకు అనుమతివ్వడం లేదు. ఈ క్రమంలో ఆగస్టు మధ్య వరకు కూడా రైల్వే సేవలను పునరుద్ధరించబోవడం లేదనేది తాజా సమాచారం. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ.. అన్ని రకాల అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌లకు సంబంధించి పూర్తి సొమ్మును ప్రయాణికులకు రీఫండ్‌ చేయాల్సిందిగా అన్ని జోన్లకు సూచించినట్లు సమాచారం.

* వరుసగా 18 వ రోజు అంటే ఈరోజు కూడా డీజిల్ ధరలో పెరుగు‌ద‌ల చోటుచేసుకుంది. అయితే వరుసగా 17 రోజులపాటు ధ‌రలు పెరుగుతూ వ‌చ్చిన‌ పెట్రోల్ ధరలో ఈ రోజు మార్పు చోటుచేసుకోలేదు. ఈరోజు డీజిల్ ధరలు 48 పైసల మేర‌కు పెరిగాయి. ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ. 79.88 కు చేరుకుంది. ఈ పెరుగుదలతో దేశంలో మొదటిసారిగా పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదైనదిగా మారింది. విశేషమేమిటంటే చాలా నగరాల్లో పెట్రోల్ కంటే డీజిల్ ఇప్పటికీ చౌకగానే ల‌భ్య‌మ‌వుతోంది. ఢిల్లీ ప్రక్కనే ఉన్న నోయిడాలో డీజిల్ ధర లీట‌రుకు రూ. 72.03, ముంబైలో డీజిల్ రూ .78.22, చెన్నైలో రూ .77.17, కోల్‌కతాలో రూ .77.06 గా ఉంది. కాగా ప‌లు దేశాలలో డీజిల్ ధర తరచూ పెట్రోల్ కంటే ఎక్కువ ధ‌ర‌కు ఎగ‌బాకుతుంది. దీనికి కారణం డీజిల్‌ ఉత్పత్తి వ్యయం కంటే పెట్రోల్ ఉత్ప‌త్తి వ్య‌యం కొంచెం ఎక్కువ.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 561 పాయింట్లు నష్టపోయి 34,868 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 10,305 పాయింట్లకు చేరింది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగి.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొన్నాయి. ముఖ్యంగా ఎఫ్‌అండ్‌వోలు సెటిల్మెంట్లు ఉండటంతో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపారు.