Sports

కపిల్ ప్రపంచకప్‌కు 37ఏళ్లు

1983 Indian World Cup Win Celebrates 37 Years - TNILIVE Sports

1983లో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలిచిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని భారత క్రికెటర్లు అంటున్నారు. ఆ మెగా టోర్నీకి అండర్‌ డాగ్స్‌గా వెళ్లిన కపిల్‌డెవిల్స్‌ దిగ్గజట్టు విండీస్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌ విశ్వవేదికపై తొలిసారి ప్రపంచకప్‌ను అందుకొంది. ఆ ఘన విజయం సాధించి నేటికి 37 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. నాటి సారథి కపిల్‌దేవ్‌తో పాటు నాటి క్రికెటర్‌, నేటి కోచ్‌ రవిశాస్త్రి, వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ పోస్టులు చేశారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 183 పరుగులకు ఆలౌటవ్వగా తర్వాత విండీస్‌ 140 పరుగులకే కుప్పకూలింది. మోహిందర్‌ అమర్‌నాథ్‌ ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అంతకుముందు లీగ్‌ దశలో జింబాబ్వేతో గెలవాల్సిన మ్యాచ్‌లో కపిల్‌ 175 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో 1983 ప్రపంచకప్‌ భారత క్రికెటర్లకే కాకుండా అభిమానులకూ ఎప్పటికీ ప్రత్యేకమే.