Agriculture

రైతుల కోసమే జీతాలు బంద్ జేసినం

రైతుల కోసమే జీతాలు బంద్ జేసినం

ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవలేదు: సీఎం కేసీఆర్‌

రైతు బంధు కొరకే ఉద్యోగుల జీతాలు ఆపాo

★తెలంగాణ వ్యాప్తంగా ఆరోవిడత హరితహారం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

★అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమేనని , తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవలేదని అన్నారు.

★కరోనా వల్ల ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పూర్తిగా జీతాలు ఇవ్వలేకపోయామని, కొద్దిగా లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వగానే ఆదాయం పెరిగిందన్నారు.

రైతుబంధు ఇచ్చేందుకే ఉద్యోగులకు జీతాలు ఆపాం: కేసీఆర్

★రైతుబంధు పథకం కోసమే ఉద్యోగులకు జీతాలు ఆపామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతుల దగ్గర డబ్బులు ఉంటే సమాజం దగ్గర ఉన్నట్టేనన్నారు.

★ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణ రైతుల్లో ధైర్యం వచ్చిందని, పల్లెలన్నీ పచ్చబడుతున్నాయన్నారు

★వర్షాల కోసం అడవులను పునరుద్ధరించాలని సూచించారు. మొక్కలు నాటాలని.. నాటిన వాటిని రక్షించాలని పిలుపు ఇచ్చారు.