తమిళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన సినిమా ‘రోబో’. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సత్తా చాటింది. కాగా ఈ చిత్రం ఫొటోషూట్‌లో తీసిన ఓ ఫొటోను సినిమాటోగ్రాఫర్ రిచార్డ్ ఎమ్ నతన్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇంత వరకు ఈ లుక్ బయటికి రాలేదని పేర్కొన్నారు. ‘2008లో ‘రోబో’ సినిమా ఫొటోషూట్‌లో నేను తీసిన స్టిల్ ఇది. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో తలైవా లుక్ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్ కోసం రజనీకి సిల్వర్ రంగు పెయింట్ వేశారు. ఇప్పటి వరకు విడుదల చేయని ఫొటో చూడండి..’ అని ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీ ‘దర్బార్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార కథానాయిక. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయం అందుకుంది. దీని తర్వాత తలైవా ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. శివ దర్శకుడు.
ఇది గ్రాఫిక్స్ కాదు
Related tags :