తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. మూడుసార్లు ఉత్తమనటిగా జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్న అరుదైన నటి శారద. ఊర్వశి శారదగా ప్రాచుర్యం పొందిన ఆమె తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఉత్తమ నటి జాతీయ పురస్కారాలు ఊర్వశి పేరుతోనే డిజైన్ చేయడంతో, ఆ పురస్కారాల్ని ఎక్కువసార్లు అందుకొన్న ఆమె ఊర్వశి శారదగానే వినతికెక్కారు. 1945లో తెనాలిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి దేవి. ఆమె అమ్మమ్మ మద్రాసులో ఉండటంతో అక్కడే శారద బాల్యం గడిచింది. ఆరేళ్ల వయసు నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. తల్లి ప్రోత్సాహంతోనే నాటక, సినమా రంగాల్లోకి అడుగుపెట్టారు. చిత్ర పరిశ్రమలో అప్పటికే సరస్వతి పేరుతో పలువురు నటీమణులు ఉండటంతో, శారద అనే నామకరణంతో సినీ ప్రయాణం ఆరంభించారు. 1955లో ‘కన్యాశుల్కం’లో చిన్న పాత్ర పోషించిన ఆమె తిరిగి, నాటకాలపై దృష్టిపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంతో శారదకి మంచి పేరొచ్చింది. ఆ తరువాత తమిళం, మలయాళం నుంచి ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. 1965లో ఆమె మలయాళంలో చేసిన ‘శకుంతల’, ‘మురపెన్ను’, ‘ఉద్యోగస్థ’, ‘కట్టు తులసి’, ‘ఇనప్రవుకల్’, ‘ఇరుత్తింటే ఆత్మవు’ చిత్రాలతో ఆమె పేరు మార్మోగిపోయింది. మలయాళంలో తెరకెక్కిన ‘ఇరుత్తింటే ఆత్మవు’, ‘తులాభారం’ చిత్రాలతో పాటు… తెలుగు చిత్రం ‘స్వయంవరం’ చిత్రాల్లో నటనకిగానూ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు శారద. 1993 తరువాత ఆమె పరిమితంగా సినిమాలు చేశారు. శారద తన స్వస్థలం తెనాలి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆమెకి వ్యాపారంలోనూ ప్రవేశం ఉంది. లోటస్ చాక్లెట్స్ పేరుతో ఒక కర్మాగారం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలుమార్లు నంది పురస్కారాలతో పాటు, ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు శారద. అలాగే కేరళ ప్రభుత్వం నుంచి స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు ఆమెకి లభించాయి. తెలుగు నటుడు చలంని వివాహం చేసుకున్న శారద, ఆ తరువాత కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. గంభీరమైన స్వరమున్న శారద పుట్టినరోజు ఈ రోజు.
అరుదైన నటి…ఊర్వశి శారద
Related tags :