దక్షిణ అమెరికా విప్లవకారుడు ఎర్నెస్టో చే గువేరా పుట్టినిల్లు అమ్మకానికి ఉన్నది. 20వ శతాబ్ధపు వామపక్ష ఉద్యమకారుడిగా ప్రపంచవ్యాప్తంగా చే గువేరాకు గుర్తింపు ఉన్నది. అర్జెంటీనాలోని రొసారియో నగరం మధ్యలో ఉన్ననియో-క్లాసికల్ స్టయిల్ బిల్డింగ్‌లో చే గువేరా జన్మించారు. 2002 నుంచి ఆ బిల్డింగ్‌కు ఫ్రాన్సిస్‌కో ఫరుగియా ఓనర్‌గా ఉన్నారు. చేగువేరా పుట్టిన ఆ బిల్డింగ్‌ను అతను సాంస్కృతిక కేంద్రంగా మార్చాలనుకున్నాడు, కానీ ఆ ప్రణాళికలు ఫలించలేదు. అయితే బిల్డింగ్‌ను ఎంతకు వేలం వేస్తున్నారన్న విషయాన్ని అర్జెంటీనా వ్యాపారవేత్త వెల్లడించలేదు.రొసారియా నగరంలోని ఉర్క్విజా, ఎంట్రీ రియోస్ వీధుల నడమ చేగువేరా పుట్టిన బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్‌ను ప్రతి ఏడాది వేలాది మంది సందర్శిస్తుంటారు. 1928లో మధ్యతరగతి సంపన్న కుటుంబంలో చేగువేరా జన్మించారు. అయితే దక్షిణ అమెరికాలో ఉన్న పేదరికం, ఆకలికేకల వల్ల అతను విప్లవ ఉద్యమ బాటపట్టాడు. 1953 నుంచి 59 వరకు జరిగిన క్యూబా విప్లవంలో చేగువేరా కీలక పాత్ర పోషించారు.
చేగువెరా ఇల్లు అమ్మకం
Related tags :