రాష్ట్రంలో 10 జిల్లాల్లో 10 స్టార్ హోటళ్లు నిర్మించనున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచానికి విముక్తి కలగాలని కోరినట్లు చెప్పారు.
అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కష్టాలు నుంచి గట్టెకించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు స్పష్టం చేశారు.
త్వరలోనే నూతన టూరిజం పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.