WorldWonders

నూతన రికార్డు నెలకొల్పిన మెరుపు

నూతన రికార్డు నెలకొల్పిన మెరుపు

వరల్డ్ రికార్డు సాధించిన అతిపెద్ద మెరుపు

ఏకంగా 700 కిలోమీటర్ల పొడువుతో జిగేల్మనిపించిన మెరుపు
కొన్ని క్షణాల పాటు వెలిగిపోయిన బ్రెజిల్
16.73 సెకన్లతో అర్జెంటీనా మెరుపు కూడా వరల్డ్ రికార్డు

సాధారణంగా వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు సహజం. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు క్షణకాలంలో ఆకాశాన్ని వెలిగిస్తాయి. మెరుపుల నిడివి కేవలం కొన్నిసెకన్ల పాటే, అది కూడా కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే కనిపిస్తాయి. కానీ గతేడాది బ్రెజిల్ దేశంలో మెరిసిన ఓ మెరుపు ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఈ మెరుపు ఏకంగా 700 కిలోమీటర్ల పొడవుతో బ్రెజిల్ దేశాన్ని కొన్ని సెకన్ల పాటు జిగేల్మనిపించింది. బోస్టన్, వాషింగ్టన్ డీసీల మధ్య ఎంత దూరం ఉంటుందో ఈ మెరుపు అంత పొడవున ఏర్పడి రికార్డు పుటల్లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం వరల్డ్ మెటియరాలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) వెల్లడించింది.