* ఓబులదేవర చెరువు మండలం కేంద్రములో నాటుకోళ్లు మేపుకొంటున్న ఆంజనేయులు ఇంటిలో విషాదం చోటు చేసుకుంది… తాను మేపుకొ0టున్న నాటు కోళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు.. దీంతో తనకు ఉపాధి అయిన 800 కోళ్లు మృతి చెందినట్లు వాపోయాడు. దీనిపై ఆంజనేయులు మాట్లాడుతూ ఆరు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసే తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు..
* చీటీల పేరుతో నగరంలో భారీ మోసం జరిగింది. ఓ ప్రబుద్ధుడు చీటీల పేరుతో ప్రజల్ని నమ్మించి సుమారు రెండు కోట్ల రూపాయలు టోకరా వేశాడు. దీంతో 140 కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతులు చంద్రానగర్‌లో నివాసముంటున్నారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో స్థానికులు, బంధువులు అతని వద్ద నమ్మకంగా చీటీ వేశారు. దీంతో రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న అప్పలరాజు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశాడు.
* కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంట్లో ఈడీ సోదాలుకాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులుసందేశర గ్రూప్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారుల విచారణదిల్లీలోని అహ్మద్ పటేల్ నివాసంలో ఈడీ అధికారుల విచారణసందేశర గ్రూప్ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలుఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈడీఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు గుర్తింపు
* నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో లీకైన విషవాయువుకర్నూలు: నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో లీకైన విషవాయువు లీకైంది. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ మృతి చెందారు.అమోనియా నుంచి సీవో2 తయారుచేసే గ్యాస్ లీకేజీ అయింది.విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు.అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది సహాయచర్యలు చేపట్టారు.ఇటీవలే విశాఖ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.
* అగ్రికల్చరల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరివేసుకున్న రీసెర్చ్ స్కాలర్ శ్యామల.
* విద్యుత్ తీగలు తగిలి కుటేప్ప 45 మృతి..చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట సమీపములో 12 మంది అడవి జంతువు వేట కువెళ్లి పంటపాలకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి కుటేప్ప 45 మృతి
* వాలంటీర్ పై దౌర్జన్యం చేసిన కేసులో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.
* బియ్యం బస్తాల్లో 371 మద్యం సీసాలు. తెలంగాణ నుండి గుంటూరు జిల్లా నూకలపేటకు మద్యం బాటిళ్లు తరలిస్తూ దబ్బాకు పల్లి వద్ద పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, రెండు ద్విచక్ర వాహనాల సీజ్.
* దాదాపుగా ముగిసిన ఏసిబి విచారణ. మూడో రోజు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ. సాయంత్రం ఐదు గంటల వరకూ ఉన్న కస్టడి సమయం.