DailyDose

దిగొచ్చిన బంగారం ధర-వాణిజ్యం

TNILIVE Business Roundup Today || Gold Prices Comes Down

* గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు ఎంత తగ్గిందంటే?బంగారం ధర మరోసారి దిగొచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం.బంగారం ధర తగ్గితే.. వెండి ధరమాత్రం పైకి కదిలింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధర పడిపోవడం గమనార్హం.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో శనివారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 దిగొచ్చింది.దీంతో ధర రూ.46,700కు క్షీణించింది.అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గింది. రూ.160 తగ్గుదలతో రూ.47,900కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. రూ.47,700కు చేరింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 పైకి కదిలింది.దీంతో ధర రూ.46,180కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.20 పెరుగుదలతో రూ.50,390కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.100 పైకి కదిలింది.దీంతో ధర రూ.47,700కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.80 శాతం పెరిగింది.దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1784 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.వెండి ధర ఔన్స్‌కు 0.31 శాతం పెరుగుదలతో 17.95 డాలర్లకు ఎగసింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

* పెరుగుతున్న డీజిల్ ఛార్జీలకు నిరసనగా లారీ యాజమానుల సంఘం ఆందోళన బాట పట్టింది.ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నిరసనలకు ఏపీ లారీ యజమానుల సంఘఒ పిలుపునిచ్చింది.కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వీ ఈశ్వరరావు డిమాండ్ ‌చేశారు.

* వరుసగా 21వ రోజు…‘పెట్రో’ ధరల మంట..దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.వరుసగా 21వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు పెంచాయి.పెట్రోల్ ధర లీటర్‌కు 25 పైసలు పెరగగా,  డీజిల్ ధర 21 పైసలు పెరిగింది.పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38 చేరగా.. డీజిల్ రూ. 80.40కి చేరుకుంది.అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 87.16కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.72కి పెరిగింది.కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.07 ఉండగా.. డీజిల్ రూ.75.56 ఉంది.ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.64 పెరగ్గా.. డీజిల్ రూ. 77.67కి పెరిగింది.హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 83.44కి చేరగా.. డీజిల్ రూ. 78.57కి చేరింది.అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.69కి పెరగగా.. డీజిల్ లీటర్ రూ.78.79కి ఎగిసింది.

* ఈ నెల 30తో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే, ప్రస్తుత అన్‌లాక్-1తో పోలిస్తే అన్‌లాక్-2లో పెద్దగా మార్పులేవీ ఉండవని సమాచారం. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెల 15 వరకు రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించగా, రైల్వే బోర్డు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకుంది. సమీప భవిష్యత్తులో రెగ్యులర్ రైళ్లను నడపడం సాధ్యం కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడింది.

* ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ ‘గూగుల్‌ పే’ను భారతీయ రిజర్వు బ్యాంకు నిషేధించలేదని… రిటైల్‌ చెల్లింపుల సాధికార సంస్థ- ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. దీనితో గూగుల్‌ పే నిషేధానికి గురైందంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల జరుగుతున్న ప్రచారానికి ఇంతటితో తెరపడింది. వివరాల్లోకి వెళితే…ఆర్థికవేత్త అభిజీత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ (పేమెంట్ సిస్టమ్‌)ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, తదితర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు సంస్థకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని కూడా ఆర్‌బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

* కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్‌ఎంఈ) దాదాపు 1.2 లక్షల కోట్ల లాభాలను కోల్పోయాయని పరిశ్రమ సంఘాలు, అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఉద్యోగాల సృష్టి, రూ.75-250 కోట్ల టర్నోవర్‌ చేసే కంపెనీల పునరుజ్జీవం కోసం మార్గసూచీని వివరించారని సమాచారం.