DailyDose

విశాఖ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో కరోనా-TNI బులెటిన్

విశాఖ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో కరోనా-TNI బులెటిన్

* మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉద్యోగుల్లో కరోనా కలకలం..సబ్ రిజిస్టర్ కి కరోనా పాజిటివ్..రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు రద్దు..మధురవాడ ప్రాంతాల్లో వ్యాపిస్తున్న మహమ్మారి.

* శ్రీకాళహస్తిలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

* ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి విషయంలో భారత్​ మెరుగ్గా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని తెలిపారు.

* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు. ఇండియాలో కొత్తగా 18,552 కొత్త కేసులు…384 మరణాలు. దేశవ్యాప్తంగా 5,08,953కి చేరిన కరోనా కేసులు. ఇందులో 1,97,387 యాక్టివ్ కేసులు ఉండగా, 2,95,880 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

* కరోనా మహమ్మారి విజృంభిస్తోంది!!నిన్న అత్యధిక 796 పాజిటివ్ కేసులు మరియు 11 మరణాలు నమోదయ్యాయి.అనంతపూర్ తూర్పుగోదావరి జిల్లాలో మరింత తీవ్రతరం అవుతోంది.కృష్ణాజిల్లాలో అత్యధికమైన మరణాలు నమోదయ్యాయి.అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా కొవిడ్ 19 జాగ్రత్తలు తీసుకోవాల్సిన దిగా సురక్షితంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి!!!

* ఈ నెల 30తో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే, ప్రస్తుత అన్‌లాక్-1తో పోలిస్తే అన్‌లాక్-2లో పెద్దగా మార్పులేవీ ఉండవని సమాచారం. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెల 15 వరకు రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించగా, రైల్వే బోర్డు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకుంది. సమీప భవిష్యత్తులో రెగ్యులర్ రైళ్లను నడపడం సాధ్యం కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడింది.