WorldWonders

నట్టింట్లో నాగత్రాచులు

A huge lot of snakes discovered in the middle of home

భద్రక్‌ జిల్లాలోని కొలై పంచాయతీ, రంగరాజ్‌పూర్‌ ప్రాంతంలోని బిజయ్‌ బిశ్వాల్‌ ఇంట్లో నాగుపాముల గుట్ట బయటపడింది. దాదాపు వారం రోజుల నుంచి పాముల బుసలబుసల చప్పుడు వినబడడంతో సందేహించిన కుటుంబ సభ్యులు స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో మీర్జా అరీఫ్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ బృందం సుమారు 6 గంటల పాటు శ్రమించి, 43 నాగుపాము పిల్లలతో పాటు ఓ తల్లి నాగుపామును పట్టుకున్నారు. వీటితో పాటు పొదగని 58 పాము గుడ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పాముపిల్లల దృష్ట్యా సంఘటన స్థలంలో కనీసంగా 3 తల్లి పాములు ఉండొచ్చని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కటి మాత్రమే పట్టుబడగా, మరో 2 పెద్దపాములు ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.