DailyDose

GHMCలో మరోసారి లాక్‌డౌన్-TNI బులెటిన్

KCR Thinking Of LockDown In GHMC Again

* జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి మూడు, నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్‌ చెప్పారు. కొద్ది రోజుల్లో లాక్‌డౌన్‌ విధింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఎక్కువ కరోనా కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళన అక్కర్లేదని సీఎం అన్నారు. అందరికీ సరైన వైద్యం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

* కృష్ణా జిల్లా ఏ-కొండూరు మండలం కంభంపాడులో కరోనా కలకలం. ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు నిర్దారించిన అధికారులు.

* తాజాగా కరోనా వైరస్ లక్షణాల్లో కొత్తగా మరో మూడు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 25,778 మంది నమూనాలు పరీక్షించగా 813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 8, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 50 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 755 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 13,098 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 169కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5908కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.

* దేశమంతటా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది.గడిచిన 24 గంటల్లో వరుసగా రెండో రోజూ రికార్డుస్ధాయిలో 19,906 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,859కు చేరింది.మహమ్మారితో ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశంగా అమెరికా, బ్రెజిల్‌, రష్యాల తర్వాత భారత్‌ నాలుగో స్ధానంలో నిలిచింది.ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల్లో 87 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.కాగా మధ్యస్ధాయి, తీవ్ర లక్షణాలతో బాధపడే రోగులకు డెక్సామెథాసోన్‌ ఔషధం వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది.

* ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలొ కరొనా కలకలం…ట్రిపుల్ ఐటిలొ ఓ అధికారికి కరోనా పాజిటీవ్ …గత కొంత కాలంగా వేంపల్లెలొని టీచర్స్ కాలనీలొ హోం క్వారెంటైన్ లొ ఉన్న అదికారి…క్యాంపస్ లొ అందోళన…ఓ ప్రజాప్రతినిది అనధికారిక పిఎకు కరోనా పాజిటీవ్.

* కరోనా అలెర్ట్:ప్రకాశం జిల్లాజిల్లా లో నేడు కొత్తగా 54 కేసులు నమోదు..జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కేసులు..

* కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 80 వేల 224 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు.వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 41 లక్షల 21 వేల 17. వ్యాధి నుంచి కోలుకుని 54 లక్షల 57 వేల 945 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.కాగా కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 లక్షల ఒక వేయి 262 మంది మృతిచెందారు.