DailyDose

కోటి రూపాయిల గుట్కా స్వాధీనం-నేరవార్తలు

కోటి రూపాయిల గుట్కా స్వాధీనం-నేరవార్తలు

* జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ప్రభాకర్‌రెడ్డి , అస్మిత్‌రెడ్డికి జిల్లా కోర్టు శనివారం పీటీ వారెంట్లు జారీ ….అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి , అస్మిత్‌రెడ్డికి రెండు కేసుల్లో జిల్లా కోర్టు శనివారం పీటీ వారెంట్లు జారీ చేసింది.తాడిపత్రి కేసుల్లో వారిద్దరికీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది.కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు.మరోవైపు నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.తాడిపత్రిలో రవికుమార్ అనే ఆర్టీఏ బ్రోకర్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.నకిలీ ఇన్వాయిస్‌, ఫేక్‌ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్ల తయారీపై పోలీసులు అతన్ని ఆరా తీస్తున్నారు.నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల చెలామణిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా, జేసీ ట్రావెల్స్‌ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్‌ పొడిగిస్తూ శుక్రవారం ఆదేశించింది.

* రెంటచింతల మండల YSRCP సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాదె బ్రహ్మారెడ్డి పై పశర్లపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి

* విశాఖలో భారీగా నగదు పట్టివేత. ద్వారకా బస్‌స్టేషన్‌లో భారీగా నగదు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బ్యాగ్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి.

* కోటి రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనంగుట్కా సామ్రాజ్యాధిపతిపై వరుస దాడులురాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గుట్కా మాఫియాపై ఉక్కుపాదం మోపిన నందిగామ పోలీసు బృందాలుగుట్కా సామ్రాజ్యాన్ని కుకటివేళ్ళతో పెకిలించివేసిన నందిగామ టాస్క్ ఫోర్స్ బృందం.