క్రికెట్ నుంచి వైదొలిగే ప్రాముఖ్యతను టీమ్‌ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ తనకు అర్థమయ్యేలా చెప్పాడని టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. భారత టెస్టు క్రికెట్‌లో మూడో స్థానంలో మాజీ సారథి అద్భుతమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ద్రవిడ్ తర్వాత పుజారా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ‘ద వాల్’కు వారసుడిలా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన పుజారా.. క్రికెట్ నుంచి వైదొలిగే ప్రాముఖ్యతను ద్రవిడ్ తనకు అర్థమయ్యేలా చెప్పాడని తెలిపాడు. తనకు కూడా కొద్దో, గొప్పో అదే అభిప్రాయం ఉండేదని, ఆ విషయంపై ద్రవిడ్‌తో మాట్లాడాక స్పష్టత వచ్చిందని చెప్పాడు. దాంతో తానేం చేయాలో తెలిసొచ్చిందని పేర్కొన్నాడు.
రిటైర్మెంట్ వివరించిన ద్రవిడ్
Related tags :