Editorials

వీసాదారుల ఉసురుకొట్టి నిరాశలోకి ట్రంప్

వీసాదారుల ఉసురుకొట్టి నిరాశలోకి ట్రంప్

‘‘వచ్చే అధ్యక్ష ఎన్నిక ల్లో నేను ఓడిపోబోతున్నా. మాట్లాడడం కూడా చేతకాని జో బిడెన్‌ ఈ సారి అమెరికా అధ్యక్షు డు కాబోతున్నాడు. అతడు మంచోడా, కాదా అనేది అనవసరం. కానీ అలాంటి వ్యక్తి అధ్యక్షుడుగా పనికిరాడు. నేను ఇప్పటి వరకు ఎంతో చేశాను. అయినా, కొందరికి నేను నచ్చడం లేదు’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. నవంబర్‌ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని నిన్నమొన్నటి వరకు అనేక సర్వేలు వెల్లడించాయి. 55 శాతం మంది బిడెన్‌కు మద్దతిస్తుండగా.. ట్రంప్‌నకు కేవలం 40 శాతం మందే మద్దతుగా నిలుస్తున్నారని సర్వేలు చెబుతుండడంతో ఆయన తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. కానీ, రోజు గడవక ముందే ఆయనలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఇటీవల ఓ సంస్థ అ మెరికాలో నివసిస్తున్న భారతీయుల మూడ్‌ తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. ఇందులో.. ఇండో-అమెరికన్లు.. ఈ సారి ఎన్నికల్లో ట్రంప్‌ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడయింది. సాధారణం గా డెమొక్రాట్లకు అండగా నిలిచేవారు కాస్తా ఈ దఫా రిపబ్లికన్ల వైపు మళ్లారని సర్వే తేల్చింది. ఇదే ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌లో నూతనోత్సాహాన్ని నింపింది.