తెరాస మలేషియా మరియు తెలంగాణ మలేషియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ కోర్ కమిటీ సభ్యులతో కలిసి మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఈ వేడుకలు నిర్వహించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి, తెరాస మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు తదితరులు పీవీ జీవిత విశేషాలపై ప్రసంగించారు. ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకి తెరాస మలేషియా శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కుర్మ మారుతి, గుండా వెంకటేశ్వర్లు, రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, ఓంప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, దిలీప్ కపిడి, రాజేష్ తోడేటి తదితరులు పాల్గొన్నారు.
మలేషియాలో వైభవంగా పీవీ శత జయంతి
Related tags :