మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర పోవాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికీ ఇదే వాస్తవం. కొంతమంది నిద్రవచ్చినప్పుడు నిద్రపోతుంటారు. మరికొంతమంది టైం దొరికినప్పుడల్లా నిద్రపోతూనే ఉంటారు. వీరిలా కాకుండా కొందరైతే అసలు నిద్రపోరు, మరికొందరైతే కుంబకర్ణుడిలా నిద్రపోతూనే ఉంటారు. అసలు మనిషి రోజుకు 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది కదా.. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటే పొరపాటే….నిద్ర అనేది మనిషిని బట్టి కాదు, వయసుని బట్టి పోవాలి అంటున్నారు నిపుణులు. అందుకే ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలో వివరించారు నిపుణులు.
1. పుట్టినప్పటి నుంచి 3నెలల వరకు పిల్లలు సుమారు 17 గంటలు నిద్రపోవాలి.
2. 4-11 నెలల వయసు ఉన్న పిల్లలు 12-15 గంటలు నిద్రపోవాలి.
3. 1-2 ఏండ్ల వయసు పిల్లలు 11-14 గంటలు తప్పనిసరి.
4. 3-5 ఏండ్ల వయసు ఉన్న పిల్లలు 10-13 గంటలు.
5. 6-13 ఏండ్ల వయసు ఉన్న పిల్లలు 9-11 గంటలు వరకు నిద్రపోవాలి
6. 14-17 ఏళ్ల వయసు గలవారు 8-10 గంటలు నిద్రపోవాలి.
7. 18-25 ఏండ్ల వయసు వారు 7-9 గంటలు.
8. 26-64 వయసు ఉన్న వారు 7-9 గంటలు.
9. 65+ పై బడిన వారు 7-8 గంటలు నిద్ర పోవాలి.