భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండో-చైనా వాస్తవాధీనరేఖ వద్ద ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించాయి. ఒక్క ఇండయాతోనే కాకుండా చైనా పలు దేశాలతో కయ్యం పెట్టుకుంటోంది. జపాన్ తో సైతం ఇటీవలి కాలంలో ఘర్షణ వైఖరిని అవలంబిస్తుండటంతో… ఆ దేశం తన నేవీని బలోపేతం చేసింది. చైనాతో సమస్యలు ఉన్న నేపథ్యంలో భారత్, జపాన్ దేశాలు. హిందూ మహాసముద్రంలో వార్ షిప్పులతో సంయుక్త విన్యాసాలను నిర్వహిచాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, హిందూ సముద్ర జలాల్లో చైనా కుటిల చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో… ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు ఒక జాయింట్ ఫ్రంట్ గా ఏర్పడే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో, భారత్, జపాన్ దేశాలు నావికాదళ విన్యాసాలను నిర్వహించడం గమనార్హం. చైనాకు ఒక హెచ్చరికను జారీ చేసే క్రమంలోనే ఈ విన్యాసాలు చోటు చేసుకున్నాయి. భారత్ కు చెందిన ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ కులీశ్…జపాన్ కు చెందిన జేఎస్ కషిమా, జేఎస్ షిమయుకిలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి. గత మూడేళ్లలో ఇరు దేశాలు కలిసి సంయుక్త విన్యాసాలను నిర్వహించడం ఇది 15వ సారి. వ్యూహాత్మక చర్యల్లో భాగంగానే విన్యాసాలను నిర్వహించామని జపాన్ రాజయబారి సతోషి సుజుకి ఈ సందర్భంగా తెలిపారు.
ఇండియా జపాన్ సంయుక్త విన్యాసాలు
Related tags :