తెలంగాణ ఎన్నారై సెల్ మరియు తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ గారి శతజయంతి ఉత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏడాది పొడుగునా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన సేవలను, కృషిని చాటి చెప్పేలా చేస్తున్న ప్రయత్నానికి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్, టీఆరెస్ ఒమాన్ ఉపాధ్యక్షుడు షైక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,కార్యదర్శి సాయి కుమార్ చౌదరి, నర్సయ్య, వీరేందర్, అజయ్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఒమాన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలు
Related tags :