NRI-NRT

పీవీకి స్విస్ ప్రవాసుల ఘన నివాళి

Switzerland Telugu NRI NRT News || PVNR 100 In Switzerland

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా స్విట్జర్లాండ్ లో తెలుగు సంఘాలు పీవీ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీధర్ గందె మాట్లాడుతూ పీవీ ఎన్నో శిఖారాలను అధిరోహించినా నిరాడంబరంగా జీవించారన్నారు. ఆర్థిక సంస్కరణలకు ​శ్రీకారం చుట్టి దేశాభివృద్ధికి పాటుపడిన అపర చాణక్యుడు అని పీవీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్విస్ తెలుగు సంఘాల బాధ్యులు కిషోర్, అనిల్, పద్మజ, వేణు, కృష్ణారెడ్డి, పవన్, విజయ్ పాల్గొన్నారు.