తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో పీవీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్, పీవీ కుమార్తె వాణీదేవి, లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ, పీవీ జయంతి వేడుకల కమిటీ సభ్యుడు బిగాల మహేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పలు దేశాలకు చెందిన ప్రవాసులు ఈ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడినపెట్టారని కొనియాడారు. వాణీదేవి మాట్లాడుతూ పీవీ క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యతను ఇచ్చేవారని అన్నారు. రాజకీయ పార్టీలు, సంఘాలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా పీవీ జయంతిని జరుపుకోవాల్ని మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. TeNF అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీఫ్ ప్రతినిధులు కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధులు సుమన్ రావు, కిషోర్ మునగాల, సంతోష్ ఆకుల, కిల్లి ప్రసాద్-యుక్త, డా రాములు-TAL, రాంబాబు-తార, జీపీఐ-ఉదయ్ నాగరాజు, వైరాలజి శాస్త్రవేత్త బాల శ్రీనివాస్, లండన్ కార్పొరేటర్ ప్రభాకర్ ఖాజా, ఉదయ్, రెహానా, చార్టెడ్ అకౌంటెంట్ మోహన్ మద్ది, అమెరికా నుండి శ్రీధర్ గౌడ్, గంగసాని రాజేశ్వర్రెడ్డి(నాటా), TeNF వ్యవస్థాపకుడు గంపా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
TeNF ఆధ్వర్యంలో లండన్‌లో పీవీ జయంతి
Related tags :