DailyDose

ఏలూరు సీఐకి కరోనా-TNI బులెటిన్

ఏలూరు సీఐకి కరోనా-TNI బులెటిన్

* ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ కి కరోనా పాజిటివ్సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు అతని కుటుంబం సభ్యులకు సోకిన కరోనా వైరస్.స్టేషన్ లో చేపట్టిన సూపర్ శానిటేషన్ పనులు, సిబ్బందికి కోవిడ్ టెస్ట్ లు చేస్తున్న జిల్లా యంత్రాంగం…

* దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది.తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,459 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5.48 లక్షలు దాటింది.

* జులై-31 వరకు లాక్ డౌన్ పొడిగించిన మహారాష్ట్ర సర్కార్. కేసులు పెరుగుతున్న సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న ఠాక్రే ప్రభుత్వం.

* మంత్రి ఈటెల రాజేందర్…గత మూడు నెలల నుంచి దేశంలో మరణాలు ఎక్కువగా లేవు.దేశంలో 3శాతం ఉంటే తెలంగాణ లో 1.7శాతం మాత్రమే డెత్ రేట్ ఉంది.ఢిల్లీ-ముంబై-కలకత్తా అంత కాకపోయినా హైదరాబాద్ కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ICMR నిబంధనల ప్రకారం హోమ్ ఐసోలేషన్ లో పెట్టి చికిత్స అందిస్తున్నాము.రేపటి నుంచి మళ్ళీ టెస్టులు పునరప్రారంభిస్తున్నాము* ప్రస్తువం 2వేల శాంపిల్స్ మాత్రమే ఉన్నాయి.* కేసులు ఎక్కువగా ఉంటే-కంటైన్మెంట్ ఏరియాలను ఏర్పాటు చేయాలని అన్నారు!.అవసరం అయితే హైదరాబాద్ లో లాక్ డౌన్ పెడతామని సీఎం అన్నారు* ప్రభుత్వ హాస్పిటల్ లలో రోగులను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.* నిన్న చెస్ట్ హాస్పిటల్ లో మరణించిన వ్యక్తి అనేక హాస్పిటల్స్ తిరిగి చెస్ట్ హాస్పిటల్ కి వచ్చాడు.* చెస్ట్ హాస్పిటల్ లో హెడ్ నర్స్ మరణించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 30,216 శాంపిళ్లను పరీక్షించగా మరో 706 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 302 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.తాజాగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.మహమ్మూద్ ఆలీ గత కొద్ది రోజులుగా కోరనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు.పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఆయన ఆదివారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

* తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా.మహారాష్ట్ర,ఢిల్లీ,తమిళనాడు తరువాత ఒక రోజులో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా ఏపీ,తెలంగాణ.గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 983 కేసులు,నలుగురు మృతి.తెలంగాణాలో మొత్తం 14,419 కేసులు, 247మంది మృతి.గడిచిన 24 గంటల్లో ఏపిలో 813 కేసులు,12 మంది మృతి.ఏపీలో మొత్తం 13,098 కేసులు,169 మంది మృతి.