Health

చైనాలో మరో కొత్త వైరస్

చైనాలో మరో కొత్త వైరస్

చైనా లో కొత్త రకం ఫ్లూ వైరస్

కొత్త రకం ఫ్లూ వైరస్ ఒకటి చైనా పందుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆదిలోనే కట్టడి చేయకపోతే ఇది మనుషుల్లోకి ప్రవేశించి, తద్వారా మహమ్మారిగా పరిణమించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ లాగానే ఇది వేగంగా వ్యాపించగలదని, ఉత్పరిణామం కూడా చెందుతుందని వారు చెబుతున్నారు.

ప్రపంచాన్ని చుట్టబెట్టే మహమ్మారికి ఉండాల్సి లక్షణాలు ఈ కొత్త వైరస్‌కూ ఉన్నాయని వారు చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలు అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.