ScienceAndTech

ప్లేస్టోర్ నుండి టిక్‌టాక్ ఔట్

ప్లేస్టోర్ నుండి టిక్‌టాక్ ఔట్

చైనా యాప్‌ టిక్‌టాక్‌ను గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌‌ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్‌, యాపిల్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. టిక్‌టాక్‌, హెలో, షేర్‌ ఇట్‌తో సహా 59 చైనీస్‌ యాప్స్‌ను నిషేధిస్తూ చైనాకు భారత్‌ షాకిచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.