* విజయనగరం జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి రూ.31లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరు పరిచారు.భోగపురం సమీపంలో సవరవల్లి సంతలో దొంగనోట్లు గుర్తించి బోగపురం సర్కిల్ పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం టౌన్ లో ఒక ఇంట్లో నకిలీనోట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారుడెంకాడ మండలంలోని అక్కివరం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్ధి కంది రాము, ఆయన గ్యాంగ్ మజ్జి రమణ, గౌరునాయుడు. లెంక శేఖర్ , సురేష్ , మొగిలి విజయ్ కిరణ్ లను అరెస్ట్ చేశారు.
* ఏపీ టూరిజం కార్యాలయంలో ఉద్యోగినిపై దాడికి పాల్పడిన భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
* రాజానగరం మండలం దివాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఉల్లి మార్కెట్లో స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దివాన్ చెరువు వద్ద స్థానికంగా ఉన్న కూలీలు ఉల్లి ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు.కాగా రాజమండ్రికి సంబంధించిన జట్టు కూలీలు వచ్చి ఉల్లి ఎగుమతులు, దిగుమతులు చేయడాన్ని స్థానిక కూలీలు అడ్డుకున్నారు.తమ మార్కెట్లోకి వచ్చి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పర దాడులు చూసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి యూనియన్ నాయకులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.
* చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో సరికొత్త సైబర్ క్రైం చోటు చేసుకుంది. మదనపల్లె వన్ టౌన్ సిఐ తమీమ్ అహమ్మద్ ఆద్వర్యంలో ఎస్ఐ ప్రసాద్ రావు పోలీసు సిబ్బంది ఈ సైబర్ క్రైంను ఛేదించారు. పలు షాపులలో వస్తువులు, విలువైన దుస్తులు కొనుగోలు చేసి, ఊఫా ద్వారా నగదు పంపిస్తామని, నకిలీ మెసేజ్ పంపించే ముఠాను మదనపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె కేంద్రంగా జరిగిన ఈ మోసాన్ని పలువురు షాపు యజమానులు పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మదనపల్లె వన్ టౌన్ పొలీసు స్టేషను నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ రవిమనోహరచారి వెల్లడించిన వివరాలు ఇలా వుంది. తొమ్మిది మంది సభ్యులు కలిగిన ముఠా షాపింగ్ ద్వారా కొనుగోలు చేసి డబ్బు చెల్లించినట్లు ఫెక్ మెసేజ్ పంపించే వారిని గుర్తించారు. వీరందరూ చదువుకున్న యువతీ యువకులు కావడం విశేషం. వీరందరూ జల్సాలకు అలవాటు పడి ఇలాంటి మోసాలకు తెగించినట్లు తెలిపారు. పెద్దగా చదువురానివారు, అమాయకులైన షాపు యజమానులను టార్గెట్ గా చేసుకోని అకౌంటులో డబ్బులు పడినట్లు మెసేజ్ పంపించి మోసాలు చేసారు. మదనపల్లె కాకుండా వీరు నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని, విచారిస్తున్నామని తెలిపారు. నిందితులు అందరూ మదనపల్లె వారే కావడం విశేషం. ఈ ముఠాలో ఒక అమ్మాయి కూడా వుంది. వీరు బ్యాచ్ లుగా ఏర్పడి షాపింగ్ చేస్తారు. మొదట అమ్మాయి షాపింగ్ చేసిన తరువాత గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం తదితర వాటి ద్వారా నగదు పంపిస్తాని చెప్పి వారి ఫోన్ నంబరుకు నగదు పంపినట్లు నకిలీ మెసేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పలు షాపులకు చెందిన వారు మోసపోయారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని కొందరు ఇండ్లలో సగం ధరకే మొబైల్ ఫోన్లు, ఫ్రీడ్జులు, ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు ఇతర వస్తువులు అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు 23ఏళ్ళ వయసు లోపుగల అఖిల్, భరత్ కుమార్,హరీష్,పృథ్వి, అజయ్ కుమార్,సాయిచరణ్, వికాస్, చిరంజీవి, చిన్నరెడ్డిలుగా గుర్తించారు. వీరందరూ మదనపల్లె వారు కావడం గమనార్హం.ఈ సందర్భంగా డిఎస్పీ రవిమనోహరచారి పట్టణంలోని షాపు యజమానులకు, పట్టణ ప్రజలకు ఎవరైనా సరే అన్ లైన్ ద్వారా డబ్బు పంపిస్తామని చెప్పినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, డబ్బు అకౌంట్లో జమ అయిన తరువాత సరుకులు డెలివరీ ఇవ్వలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ తమీమ్ అహమ్మద్, ఎస్ఐ ప్రసాద్‌రావు పాల్గొన్నారు.