అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని ఖండించిన చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు. “ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నాను. సాయంత్రం 5గం తర్వాత 4.20గం సమయం వేసి డిశ్చార్ చేయడం దుర్మార్గం. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించక పోవడం గర్హనీయం.” అని చంద్రబాబు ఓ ప్రకటనలో ఆవేదన చెందారు.
################
మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈఎస్‌ఐ స్కాంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నను.. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అచ్చెన్న రిమాండ్ గడువును ఏసీబీ కోర్టు పొడిగించింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆస్పత్రి అధికారులు సడెన్‌గా డిశ్చార్జి చేశారు. దీంతో అచ్చెన్నను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు.
################