తన నటనతోనే కాదు, అందంతోనూ ఆనాటి అమ్మాయిల హృదయాలను దోచిన నటుడు శోభన్‌బాబు. అందుకే ఆయన్ను అందరూ ‘సోగ్గాడు’ అని పిలుస్తుంటారు. వందల చిత్రాలు చేసిన అనుభవం ఆయన సొంతం. ఎంతోమంది నటులు శోభన్‌బాబు సినిమాలతోనే పరిచయమయ్యారు. ఎవరిలో ఎలాంటి ప్రతిభ దాగుందో ఆయన పసిగట్టకుండా ఎలా ఉంటారు? అనేక భాషల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప‌్రకాష్‌రాజ్ గురించి అప్పట్లోనే శోభన్‌బాబు ఓ మాట చెప్పారట. ఈ విషయాన్ని ప్రకాష్‌రాజ్ ఓ సందర్భంలో పంచుకున్నారు.. శోభన్‌బాబు చెప్పింది చెప్పినట్టుగానే తన జీవితంలో జరిగిందంటూ ఆ మాటల్ని గుర్తు చేసుకొన్నారు. ‘‘శోభన్‌బాబు నేనూ.. ‘దొరబాబు’ చిత్రంలో నటించాం. అప్పుడప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టినవాణ్ని దాంతో ఉత్సాహంగా కనిపించేవాణ్ని. యాక్షన్ సన్నివేశాల్లో నా ఆవేశం చూసి ‘ప్రకాష్… నటనే కదా, ఎందుకంత తొందర, కాస్త నిదానం’ అన్నారు. అలాగే ఒక రోజు ఆయన నన్ను దగ్గరికి పిలిచి ‘ప్రకాష్ నువ్వు రెండేళ్ల తర్వాత నన్ను మళ్లీ కలువు’ అన్నారు. ‘రెండేళ్ల తర్వాత కలవమని ప్రత్యేకంగా చెప్పడమేంటి గురువుగారూ, తప్పకుండా కలుస్తా’ అని చెప్పా. ఆయనప్పుడు ‘నువ్వు కలవలేవు, ఎందుకంటే అప్పుడు బిజీ ఆర్టిస్టువి అయ్యుంటావు’’ అని చెప్పారు.
శోభన్‌బాబు జోస్యం నిజమైంది
Related tags :