శివాజీ గణేశన్ హీరోగా జెమినీ సంస్థ తమిళంలో నిర్మించిన ‘మోటార్ సుందరం పిళ్ళై’ బాగా ఆడింది. ఆ చిత్రాన్ని ఏయన్నార్‌తో తెలుగులో నిర్మించాలని ‘మధు పిక్చర్స్’ నిర్మాత పి.మల్లికార్జునరావు అనుకున్నారు. నడి వయసులో పిల్లల తండ్రి పాత్రలో తనను చూసేందుకు అభిమానులు అంగీకరించరంటూ ఏయన్నార్ వద్దన్నారట. అప్పుడు ఓ రోజు జెమినీ అధినేత ఎస్.ఎస్.వాసన్ ‘మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను’ అంటూ నాగేశ్వరరావుకు ఫోన్ చేశారట. ‘మీరు పెద్దవారు. నా వద్దకు రావడమేమిటి? నేనే వస్తాను’ అంటూ ఏయన్నార్ చెబుతున్నా వాసన్ పనిగట్టుకుని వచ్చారట. వచ్చి, ‘ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఇదంటే నాకెంతో ఇష్టం. ఈ పాత్రలో గ్లామర్ లేదని మీరు భావించవద్దు. కొన్నాళ్ళు పోయాక వయసు మళ్ళిన పాత్రలు ఎలాగూ వేయక తప్పదు. ఇప్పుడు మీరు నటిస్తేనే ఈ పాత్రకు నిండుదనం వస్తుంది’ అంటూ ఏయన్నార్‌ని ఒప్పించారట. ఫలితంగా ‘మంచి కుటుంబం’ రూపొందింది. వాసన్ ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందింది.
పెద్దల పట్ల అక్కినేని గౌరవం అది
Related tags :