తిరువూరులో మమ్మీడాడీ దుకాణాల యజమాని తల్లి కరోనాతో మృతి చెందినట్లు వార్తలు వెలువడటంతో బుధవారం నాడు రెండోరోజు కూడా లాక్‌డౌన్ పటిష్ఠవంతంగా అమలు చేశారు. దుకాణం యజమానులు నివాసం ఉంటున్న 200మీటర్ల దూరం మేర రహదారులను అధికారులు మూసేశారు. ఈ దుకాణ యజమానులతో పాటు 38 మంది సిబ్బందికి గురువారం నాడు రక్త పరీక్షలు నిర్వహించారు. బుధవారం నాడు ఈ మేరకు వారికి సమాచారం అందించారు. ఈ 38మంది ఉద్యోగులు పనిచేశారని గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. తిరువూరుతో పాటు కాకర్ల, మునుకుళ్ల, రోలుపడికి చెందిన ఉద్యోగులు ఉండటం వలన ఆయా గ్రామస్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ 38మంది పేర్లను అధికారులు విడుదల చేసి వారికి దూరంగా ఉండాలని సూచించారు. నూజివీడులోని రక్తపరీక్ష కేంద్రానికి బుధవారం నాడు సెలవు కావడంతో గురువారం నాడు పరీక్షలు చేస్తారు.
*** తిరువూరుకు భారీ కుదుపు
తిరువూరులో రెడీమేడ్ దుకాణా యజమాని తల్లి కరోనాతో మృతిచెందిందనే వార్త పట్టణంతో పాటు పరిసర గ్రామ ప్రజలను భారీగా భయంతో కుదిపింది. ఈ దుకాణంలో గత నెలరోజుల వ్యవధిలో వేలసంఖ్యలో వినియోగదారులు వస్త్రాలను కొనుగోలు చేశారు. సిబ్బంది కరోనా పరీక్ష ఫలితాల కోసం వీరంతా భయాందోళనలతో ఎదురు చూస్తున్నారు.